హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..!

MBNR: జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా ఎస్పీ డీ.జానకి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లలో శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన పాయింట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, అనుమతి లేని డీజేలు, ప్రమాదకరమైన విద్యుత్ వైరింగ్‌లపై నిషేధం విధించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.