తూ.గో జిల్లా నల్లజర్ల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి ప్రకాశరావుపాలెంలో రేకుల షెడ్డు ఎగిరిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ప్రకాశరావుపాలెం సహా ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
నల్లజర్ల మండలంలో గాలివాన బీభత్సం


