హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే సాగనీటి విడుదల

NGKL: జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగునీటిని విడుదల చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఒత్తిడి, అన్నదాతల ఉద్యమం ఫలించిందని బుధవారం ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎప్పుడూ బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని.. రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.