హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఆస్ట్రేలియాకు TBJP చీఫ్ రామచందర్‌రావు

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు రేపు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనున్నారు. అక్కడ తెలుగు అసోసియేషన్ సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం ఈనెల 28న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. అయితే, రామచందర్‌రావు కుమార్తె ఆముక్త ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో డైరెక్టర్‌గా స్థిరపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తున్న విషయం తెలిసిందే.