ఉమ్మడి తూ.గో జిల్లాలోని అన్నవరం సత్యదేవుడి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. రత్నగిరి కొండపై కొలువైన సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారి దర్శనంతో పాటు సత్యనారాయణ వ్రతాలు చేయడం ప్రత్యేకత. కొండపై నుంచి కనిపించే పచ్చని ప్రకృతి, గోదావరి పరిసరాల దృశ్యాలు భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఆంధ్రప్రదేశ్
రత్నగిరి కొండపై సత్యదేవుడి వైభవం!


