హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారిపై భారీ చెట్టు.. గంటలోనే తొలగింపు

ASR: చింతపల్లి మండలం ఉరిసింగి గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం భారీ చెట్టు రహదారిపై కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కొమ్మంగి వీఆర్వో నాగబాబు వెంటనే స్పందించి పంచాయతీ, ఇంజినీరింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీబీని రప్పించి సిబ్బంది సహాయంతో చెట్టును తొలగించారు. రహదారిని పూర్తిగా క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించారు.