అన్నమయ్య: పెద్దమండెం మండలంలో వెలుగుల్లు గ్రామ స్వర్ణ వద్ద మదనపల్లె లయన్స్ క్లబ్, స్పెషల్ ఆఫీసర్ తేజస్విని సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 95 మందికి పరీక్షలు చేయగా, 39 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. 23 మందికి కంటి అద్దాలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్, VRO శ్రీనివాసులు, కార్యదర్శి ఖాదర్ బాషా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన


