హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా గోవిందపురం పీహెచ్‌సీ దారి

SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పీహెచ్‌సీకి వెళ్లే దారి గుంతలతో అధ్వానంగా మారింది. మట్టి రోడ్డు కావడంతో సిబ్బంది, రోగులు కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూండి ఉద్దానం పరిసర ప్రాంతీయులు రావాలంటే మధ్యలో రైల్వే గేటు దాటాలి. ట్రాక్ పక్కనుంచి ఉన్న తాత్కాలిక రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వర్షం పడితే నడవలేని పరిస్థితి నెలకొందన్నారు.