హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ వైర్లు తెగి రైళ్లకు అంతరాయం

GNTR: తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం విద్యుత్‌ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు-రేపల్లె రైలు స్టేషన్‌ ఔటర్‌లో నిలిచిపోయింది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.