PPM: తుఫాన్ నేపథ్యంలో పశుపోషకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సూచించారు. పశువుల షెడ్లను పటిష్టంగా ఉంచి, 3–4 రోజులకు సరిపడా పశుగ్రాసం, దాణా, మంచినీటిని నిల్వ చేసుకోవాలన్నారు. పశువులను లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. తడిసిన లేదా బూజు పట్టిన గడ్డి, దాణాను పెట్టరాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాన్ వేళ పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి'


