హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రసాయనిక జలాలు వదలకుండా చూడాలి'

AKP: పరవాడ మండలంలో రాంకీ సంస్థ నుంచి వ్యర్థ రసాయన జలాల విడుదలను అరికట్టేందుకు జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. వర్షాల సమయంలో భారీగా వ్యర్థ జలాలను కాలువలోకి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిన్నాయన్నారు.