హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికా మార్కెట్‌లోకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తొలి EHV ట్రాన్స్‌ఫార్మర్

కడపకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ అమెరికాకు తొలి 175 MVA, 345 kV EHV పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేసింది. ప్రయాగ్‌రాజ్‌ నైనీ ప్లాంట్‌లో తయారైన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమెరికాకు రవాణా చేశారు. రాబోయే 12-18 నెలల్లో నైనీ యూనిట్‌ ద్వారా రూ.500-600 కోట్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ CEO శరత్‌ చంద్ర కొల్లా తెలిపారు.