కృష్ణా: ఉయ్యూరులో సెల్‌ఫోన్ దుకాణానికి కస్టమర్‌లా వెళ్లి ఫోన్లు పరిశీలిస్తున్నట్లు నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న యువకుడిని ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన ఓగిరాలకు చెందిన దండుగుల నాగ దుర్గారావును అదుపులోకి తీసుకుని, అతని నుంచి సుమారు రూ.లక్ష విలువైన 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు ఎస్సై ప్రతాపరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కస్టమర్‌లా నటించి.. సెల్‌ఫోన్లు కాజేశాడు'


