హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగులేటి అనుచరులపై దాడి.. 8 మందిపై కేసు నమోదు

KMM: తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా శివారులో మంగళవారం రాత్రి కాంగ్రెస్ నాయకులు దయాకర్ రెడ్డి, నరేశ్ రెడ్డి కారుపై రాళ్ల దాడి చేసిన ఘటనలో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.బోడ రమేష్ ఫిర్యాదు మేరకు కిషన్, మోహన్, బాలు, శ్రీను, రవి, మల్లికార్జున్, సోమన్న, ఆర్మీ రవిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.