ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. పోలీస్ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. 18 రెగ్యులర్, 2 రొటేటింగ్ క్రేన్లు, 150 మంది గజ ఈతగాళ్లు, రక్షణ పడవలు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి :కలెక్టర్


