హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో మెగా జాబ్ మేళా

తిరుపతి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. UNO MINDA కంపెనీలో 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉండి.. ITI, డిప్లొమా చదివిన వాళ్లు అర్హులు. హోసూర్‌లో ఉద్యోగంతో పాటు నెలకు రూ.19 వేల జీతం ఇస్తారు. అవసరమైన ధ్రువపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు.