హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లీబిడ్డల మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన

ASR: సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి చెందారంటూ కొలపరి గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు ఆరోపించారు. గర్భిణి శాంతి(27)కు ఈ నెల 18న ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృత శిశువుకు జన్మనిచ్చింది. 20న కేజీహెచ్‌లో చేరిన శాంతి 21న మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.