BDK: బూర్గంపాడు మండలంలో వృద్ధురాలిని అమానుషంగా హింసించిన ఘటనపై తెలంగాణ మానవహక్కుల కమిషన్ స్పందించింది. పేపర్లో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుని సుమోటోగా స్వీకరించింది. బాధితురాలి స్వేచ్ఛగా జీవించే హక్కుకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే నెల 27వ తేదీలోగా అందించాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించింది.
తెలంగాణ
వృద్ధురాలి హింస ఘటనపై స్పందించిన మానవహక్కుల కమిషన్


