హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో ముగిసిన గణేశ్ నిమజ్జనం

ADB: భోరాజ్ మండలం బాలాపూర్‌లో సర్వజనిక్ గణనాథుడి నిమజ్జన వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గ్రామస్థులు విగ్రహాన్ని తమ భుజాలపై ఎత్తుకొని గ్రామ ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలతో, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సమీప వాగులో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.