హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీరు నిలవకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి'

ASR: భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పంటల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ఏవో టీ. మధుసూదనరావు మంగళవారం తెలిపారు. వరి, రాగి, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, కూరగాయలు, కాఫీ తోటల్లో నీరు నిలవకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. తెగుళ్లు, పురుగుల ఉధృతిని గమనించాలి. వర్షం పడుతున్న సమయంలో పురుగుమందులు, శిలీంద్రనాశకాలు పిచికారీ చేయకూడదని రైతులకు సూచించారు.