హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో చెరువును తలపించేలా రోడ్లు

కడప: రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా కడపలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి పడిన వర్షానికి పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ లోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.