హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడు ప్రజలు బయటకి రావొద్దు..!

KKD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రత్తిపాడు మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. చింతలూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి దండోరా వేయించి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. పిల్లలు కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.