హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నెల్లూరు నగరంలోని ఆటోనగర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో త్యాగరాజనగర్ ఫీడర్లో నూతన లైన్లు ఏర్పాటు చేస్తున్నందున బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని టౌన్ ఈఈ శ్రీధర్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు ఉండదన్నారు. జ్యోతి నగర్, అయ్యప్ప గుడి, వేదాయపాలెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తామన్నారు.