హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారెళ్లలో వజ్రం లభ్యం!

KRNL: తుగ్గలి మండల పరిధిలోని మారెళ్ల గ్రామంలో ఓ రైతుకు మంగళవారం వజ్రం లభించినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షం అనంతరం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వజ్రం దొరికినట్లు స్థానికులు తెలిపారు. లభించిన వజ్రాన్ని పగిడిరాయి గ్రామంలోని బంధువుల వద్దకు తీసుకెళ్లి టెండర్ నిర్వహించగా, ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.