హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక తరలింపు.. ట్రాక్టర్ పట్టివేత!

BHNG: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తఖియోద్దీన్ మంగళవారం సాయంత్రం తెలిపారు. తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన సత్యనారాయణ, కుమార్‌లు బేగంపేట వాగు నుంచి నర్సాపురం మీదుగా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.