సత్యసాయి: తనకల్లు మండలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న నరసింహ నాయక్, కే. గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కదిరి జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఇరువురికి చెరో రూ.19 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జరిమానా


