హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళపై RMP అత్యాచారయత్నం!

ప్రకాశం: లింగసముద్రం మండలంలో అస్వస్థతకు గురైన ఓ మహిళ భర్తతో కలిసి సోమవారం సాయంత్రం ఆర్ఎంపీ నజీర్ వద్దకు వెళ్లింది. ఆమె అనారోగ్యాన్ని అవకాశాన్ని అదునుగా తీసుకుని సదరు RMP మత్తు ఇంజెక్షన్ వేసి అత్యాచారానికి యత్నించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.