హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులనే నియమించాలి'

MLG: ఏటూరునాగారం ఆకులవారి గణపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో అర్హత, అనుభవం ఉన్న మహిళా ఉపాధ్యాయులను నియమించాలని తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయం వద్ద మాట్లాడారు. పీడీకి హెచ్‌ఎంగా అదనపు బాధ్యతలు ఇవ్వడం సరికాదని, మహిళా ప్రధానోపాధ్యాయురాలిని నియమించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.