హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నా కూతురుది ఆత్మహత్య కాదు.. తల్లి ఆవేదన

W.G: భీమవరంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె తల్లి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కుమార్తె మరణవార్త తెలుసుకొని గల్ఫ్ నుంచి హుటాహుటిన వచ్చిన ఆమె మాట్లాడుతూ.. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, దీని వెనుక కొందరి ప్రమేయం ఉందని ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె కోరారు.