ఏలూరు: రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. అధికారులు హెడాక్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని, అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


