హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఖాజీపేటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కడప: ఖాజీపేటలోని 33 కేవీ ఫీడర్లలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు, రైతులు గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు. అన్ని సబ్‌స్టేషన్లలో మధ్యాహ్నం 12 గంటల్లోపు 3-ఫేజ్ సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.