VZM: బొబ్బిలి పట్టణ CI నారాయణరావు మంగళవారం రాత్రి పాత బొబ్బిలిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. యువతను మంచి మార్గంలో నడిపించాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లెనిద్రలో ఎన్నికలపై గ్రామస్థులకు CI సూచనలు


