హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

168 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత

ATP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో 168 మంది లబ్ధిదారులకు రూ. 90,28,038 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.