హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తచెరువు కేంద్రంగా నూతన జెడ్పీ కార్యకలాపాలు

సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ పరిపాలన కార్యకలాపాలు ఈ నెల 25 నుంచి కొత్తచెరువు కేంద్రంగా ప్రారంభమవుతాయని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈవో పి. విజయలక్ష్మి తెలిపారు. కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీ కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలని కోరారు.