హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ATP: అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజు నాయుడు తెలిపారు. సమస్యలు ఉన్నవారు 95504 80972 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.