హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదం కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

BPT: పాతమాగులూరు వద్ద 2017లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు వి. ఏడుకొండలుకు అద్దంకి కోర్టు 3 నెలల జైలు శిక్ష, రూ.10,500 జరిమానా విధించింది. నాడు జరిగన ప్రమాదంలో మార్కాపురానికి చెందిన ఎస్. రమేష్ గాయపడగా, అప్పటి ఎస్సై వై. నాగరాజు కేసు నమోదు చేశారు. అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ తీర్పునిచ్చినట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు.