హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 19 వేల పింఛన్‌లు ఆమోదం

CTR: జిల్లాలో కొత్త పింఛన్‌ల కోసం అందిన 43,757 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 19,567 ఆమోదం పొందినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. మరో 22,485 దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయన్నారు. వివిధ కారణాలతో 1705 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు. అర్హులకు పింఛన్‌లు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.