సత్యసాయి: కదిరి ప్రైవేటు పాఠశాల హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బుక్కపట్నం మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పాఠశాల మైదానంలో ఆడుకుంటూ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. వార్డెన్, సిబ్బంది వెతికినా కనిపించకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు విద్యార్థుల అదృశ్యం.. కేసు నమోదు


