హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ఐదు రోజులపాటు వర్ష సూచన

సత్యసాయి: ఉమ్మడి జిల్లాలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.9–35, రాత్రి 24.2–24.6 డిగ్రీలుగా నమోదవుతాయన్నారు. ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.