హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు మహిళ మృతి

SKLM: సంతబొమ్మాళి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తంగి సీతమ్మ పాము కాటుకు గురై మృతి చెందారు. రెండు రోజుల క్రితం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఆమెను పాము కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు కుమారుడు తంగి వెంకటరమణ తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి