TPT: తడ స్థానిక జాతీయ రహదారి నిర్వహణ పరిస్థితి అద్వాన్నంగా మారింది. చినుకు పడితే రహదారిపైనే వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో కళాశాల విద్యార్థులు బస్సు ఎక్కాలంటే అవస్థలు పడుతున్నారు. మడుగులా మారిన నీటిని దాటేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అతి కష్టం మీద నీరు దాటి బస్సు ఎక్కుతున్నారు. జాతీయ రహదారి నిర్వహణ సంస్థ దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారిపై నీటి మడుగులు


