JGL: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మెట్‌పల్లి మండల వైద్యాధికారి ఎల్లాల అంజిత్‌రెడ్డి సూచించారు. డీజేలు, అధిక శబ్దంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పరిశుభ్రత పాటిస్తూ, ప్రమాదాల నివారణకు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలి'


