హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా క్రికెటర్ షఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్

ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా ప్లేయర్ షఫాలీ వర్మ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఏడాది 24 T20ల్లో షఫాలీ వర్మ 863 పరుగులు చేసింది. నిన్న శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో 29 బంతుల్లో 48 పరుగులు చేసిన షఫాలీ ఈ రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ సౌతాఫ్రికా ప్లేయర్ లారా వాల్వార్డట్ (824) పేరిట ఉంది.