PLD: జిల్లాలో పవర్‌గ్రిడ్ నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. కారం పూడి, పిడుగురాళ్ల మండలాల్లో పవర్‌గ్రిడ్ ఏర్పాటుకు 163 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేసిన ఐదు మండలాల్లో నష్టపరిహారం అంచనాలు సిద్ధం చేసి పరిహారం అందేలా చూడాలని తాహసీల్దార్లను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పవర్‌గ్రిడ్‌కు భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్


