హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మైఖేల్ ఫారడే జయంతి

GNTR జిల్లా మందడం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మద్దుకూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైఖేల్ ఫారడే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై, ఫారడే సేవలను కొనియాడారు. విద్యార్థులు శాస్త్రవేత్తల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ అధినేత మద్దుకూరి అశోక్‌ను ఈ సందర్భంగా అభినందించారు.