హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి నాలుగు రోజులపాటు పవర్ కట్

E.G: సీతానగరం అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనుల్లో భాగంగా ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఉంటుందని APEPDCL రాజమహేంద్రవరం టౌన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. శామ్యూల్ తెలిపారు. సీతానగరం మండలంలోని మునికూడలి, రాజంపేట, వెదుళ్లపల్లి గ్రామాల గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.