హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్‌ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

నంద్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామాల్లో రాత్రి బస చేసి శాంతిభద్రతలను సమీక్షించారు. రోడ్డు భద్రత, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, పోక్సో అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం డయల్‌ 112కు ఇవ్వాలని పోలీసులు సూచించారు.