KMM: కరకగూడెం మండలం, అశ్వాపురంపాడు అటవీ ప్రాంతంలో ఈ నెల 19న వజ్జా భీమరాజుపై జరిగిన దాడి కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు CI వెంకటేశ్వర్లు తెలిపారు. పశువుల కోసం వెళ్లిన భీమరాజుపై కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు కోవాసి బాలకృష్ణ, పోడియం విజయ్, కోవాసి సంతోష్, పోడియం మంగయ్యలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
తెలంగాణ
కత్తులతో దాడి కేసులో నలుగురు అరెస్ట్


