హైదరాబాద్: 28°C
తెలంగాణ

15లోపు భూ రీసర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

PDPL: జిల్లాలో భూ రీసర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ బీ.శ్రీరాములుతో కలిసి ఏడీ ల్యాండ్‌, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రతి మండలానికి ఐదు చొప్పున 70 గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసినట్లు తెలిపారు.