హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తాంసిలో ఘనంగా గణపతి నిమజ్జనం శోభాయాత్ర

ADB: తాంసి మండలంలోని కప్పర్లలో గణపతి నిమజ్జనం శోభయాత్ర మంగళవారం రాత్రి ఘనంగా కొనసాగుతోంది. మొదటగా గణపతికి వేలంపాట నిర్వహించి లడ్డూ ప్రసాదం కార్యక్రమం చేపట్టారు. అనంతరం గణపతిని రథంపై ఉంచి గ్రామంలోని పలు వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. సాంస్కృతిక పాటలకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.